పెద్దపల్లిరూరల్: ఎన్నికల సంఘం ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను చేపట్టిందని, ఇందులో అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా చూ డాల్సిన బాధ్యత బూత్‌స్థాయి ఏజెంట్, వార్డు నా యకులపై ఉందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమై సూచనలు చేశారు. ఇంటింటికీ బీఎల్‌వోలు వస్తారని, వారికి ప్రజలు సహకరించాలని కోరారు. ఓటరు జాబితాపై కొన్ని రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించి ఓట్లను తొలగించి రాజకీయ లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా అర్హులందరికీ ఓటుహక్కు ఉండేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్యతోపాటు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, బూతుస్థాయి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
సీఎం పథకాలకు దేశంలోనే గుర్తింపు
ఓదెల: సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలోనే మంచి గుర్తింపు పొందాయని విప్ విజయరమణారావు అన్నారు. జీలకుంట, ఓదెలలో మహిళా సమాఖ్య భవనం, కేజీబీవీ మూత్రశాలలు, హాళ్లు ప్రారంభించి మాట్లాడా రు. సర్పంచులు రాగిడి మంగ, కనికిరెడ్డి సతీశ్, పల్లె కనుకయ్య, పిట్టల రవికుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బైరి రవిగౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రౌతు మనోజు క్రాంతివీర్, ఎస్‌వో జ్యోతి, ఏడీఏ రవీందర్ పాల్గొన్నారు. జీలకుంట సర్పంచ్ రాగిడి మంగ, వార్డుసభ్యురాలు బంగారి పద్మ విప్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


