ధర్మారం: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నా రు. పెర్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి మంత్రి శుక్రవారం గృహప్రవేశం చేయించారు. ఇంటి యజమానులైన దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజల ను మోసం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు తగిన న్యాయం జరుగుతోందని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాం, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు, సర్పంచ్ గొల్ల కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నందాల సంగ రంజిత్ కుమార్, సర్పంచులు వేల్పుల నాగరాజు, చేపూరి లచ్చయ్య, మల్లేశం, నాయకులు మద్దుల గోపాల్‌రెడ్డి, చింతల ప్రదీప్‌రెడ్డి, ఓరం చిరంజీవి, జంగ మహేందర్, కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలో జరిగిన మొహర్రం వేడుకల్లో మంత్రి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


