అధికారుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

అధికారుల పోరుబాట

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

● మూడేళ్ల పీఆర్‌పీ చెల్లించాలి ● పదోన్నతి పాలసీ రూపొందించి తక్షణమే అమలు చేయాలి ● పారదర్శకంగా పదోన్నతి, బదిలీలు ఉండాలి ● సింగరేణిలో రాజకీయ జోక్యం పూర్తిగా ఉండవద్దు ● సంస్థకు రావాల్సిన రూ.50వేలకోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి ● అధికారుల క్వార్టర్లకు గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి ● అధికారుల ఐఐఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలి ● దీనికోసం అన్ని కార్మిక సంఘాల సహకారం కూడా కోరుతాం.

గోదావరిఖని: సమస్యల పరిష్కారం కోసం అధికారుల సంఘం సింగరేణిపై యుద్ధం ప్రకటించింది. మంగళవారం నుంచి దశలవారీగా ఉద్యం నిర్వహించాల నిర్వహించింది. ప్రధానంగా ప్రాఫిట్‌ రిలేటెడ్‌ పే(పీఆర్‌పీ) సాధనకు దశలవారీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. సింగరేణికి రావాల్సిన బకాయి లు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. సంస్థలో సుమా రు 2,200మంది అధికారులు పనిచేస్తున్నారు. ఆదివారం ఆర్జీ–2 ఏరియాలో కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అ సోసియేషన్‌(సీఎంవోఏఐ) కీలక సమావేశం నిర్వహించింది. 2022–23, 2023–24, 2024–25లకు సంబంధించి పీఆర్‌పీ చెల్లించాలని, ఇందులో రెండేళ్ల బకాయిలు రూ.277కోట్లు ఉన్నాయని వెల్లడించింది. మరోఏడాది లెక్క కూడా తేలాల్సి ఉందని పేర్కొంది. సోమవారం సింగరేణి బోర్డు ఆఫ్‌ డైరె క్టర్ల సమావేశం ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకో వాలని పట్టుబడుతోంది.

దశలవారీ ఆందోళనకు సిద్ధం

అధికారుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. తొలుత కార్మికవాడల నుంచి ర్యాలీలు నిర్వహించి జీఎంలకు వినతిపత్రాలు అందజేయడం, మలిదశలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం.. అయినా.. యాజమాన్యం స్పందించకపోతే ప్లేడేలు బాయికాట్‌ చేయడం, వర్క్‌ టూ రూల్‌ పాటించడం తమ ఉద్యమంలో భాగమని అధికారుల సంఘం ప్రకటించింది.

ప్రధాన డిమాండ్లు ఇవే..

ఉద్యమానికి సిద్ధమైన ఆఫీసర్లు

రేపటి నుంచి దశలవారీ పోరాటం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement