రవాణా చేయాలని రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రవాణా చేయాలని రైతుల ఆందోళన

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

ఓదెల: ధాన్యం కోనుగోళ్లలో వేగం పెంచాలనే డి మాండ్‌తో రైతులు శనివారం రోడ్డెక్కారు. కనగర్తి గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. 20 రోజులుగా ధాన్యం కుప్పలు పేరుకుపోయినా కొనుగోలు చేయడం లేదన్నారు. ఒక వైపు అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుందని భయపడుతుండగా, ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సమాచారం అందుకున్న ఎస్సై రమేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈకార్యక్రమంలో రైతులు, స్థానికులు ఆది సతీశ్‌, ఆది రమేశ్‌, గొడ్డం మల్లయ్య, రాపోలు మల్లేశం, రాపోలు తిరుపతి, చెరుకుతోట శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement