01. వీరు అవిభక్త కవలలు
గాలి ప్రాణస్నేహితురాలు
స్నేహితురాలు దగ్గరగా వచ్చిందా ఉబ్బితబ్బిబ్బవుతారు
కాస్త దూరంగా జరిగిందా చప్పగా చప్పబడిపోతారు
కాసేపు కనిపించనేలేదనుకో ప్రాణాలే విడుస్తారు
02. చిక్కుడు గింజలాంటి
ఆకారం చెట్టు మీద కాదు
శరీరంలో
వడపొయ్యటమే పని
తేనీటిని కాదు.. రక్తాన్ని
మలినాలను బయట పారేస్తుంది
ఇంటి నుంచి కాదు వంటి నుంచి
జవాబులు:
01. ఊపిరితిత్తులు
02. కిడ్ని
03. లివర్
03. అత్యంత పెద్ద గ్రంథి
ఆహార ధాన్యాల గిడ్డంగి
రసాయన ప్రయోగశాల
ఎవరో చెప్పుకోండి!
డాక్టర్ కందేపి రాణీప్రసాద్,
రచయిత్రి, సిరిసిల్ల


