చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

రాయికల్‌(జగిత్యాల): రా యికల్‌ ఇందిరానగర్‌కు చెందిన హమలీ కార్మికుడు సందెళ్ల శేఖర్‌ (27) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఊ పిరాడక మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శేఖర్‌ తోటి హమాలీలతో కలిసి శుక్రవారం పెద్ద చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు శేఖర్‌ మద్యం మత్తులో చెరువులోకి వెళ్లగా ఈత వచ్చినప్పటికీ ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవేందర్‌నాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement