సుల్తానాబాద్‌రూరల్: రైతులు పంటల మార్పిడిలో ట్రెండ్ మార్చాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం మియ్యపూర్(పెర్కపల్లి)లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు పంటల మార్పిడి చేయాలని, ఆయిల్‌పాం, కందులు, పెసర్లు, సన్నరకం వరి ధాన్యంతో ఇతర వాణిజ్య పంటలసాగుకు ముందుకు రావాలన్నారు. ఎరువులు ఎక్కువగా వాడటం ద్వారా భూమిలో సారవంతం తగ్గి పంటల దిగుబడి తగ్గుతుందని, సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్పంచ్‌లు పోచాలు, సాయికిరణ్, దేవేందర్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, ఏవో పైడితల్లి పాల్గొన్నారు.


