మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

ఓదెల/సుల్తానాబాద్‌ రూరల్‌: ఓదెల మల్లన్న ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వవిప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పేర్కొన్నారు. ఓదెల మల్లన్న సన్నిధిలో బుధవారం రూ.కోటితో ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణం, రూ.15 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయం అభివృద్ధిని గురించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్తా అన్నారు. ఒగ్గు పూజారులకు గుర్తింపుతో పాటు ప్రత్యేక గది నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం గుండ్లపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ, సీసీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కనగర్తి, ఓదెల, గుండ్లపల్లి గ్రామాల్లో ఆలే టి రాజు, గొట్టం అంజన్న, వడ్డూరి సారయ్య, జాగిరి కిశోర్‌గౌడ్‌, ఎంబాడి లావణ్య, ఒల్లాల మహేశ్వరీ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. సుల్తానాబాద్‌ మండలం బొంతకుంటపల్లెలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. నర్సయ్యపల్లెలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేశారు. సర్పంచులు పుప్పా ల స్వప్న, చొప్పరి సంధ్యారాణి, కనికిరెడ్డి సతీశ్‌, పల్లె కనుకయ్య, ఓదెల మల్లన్న ఆలయం చైర్మన్‌ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పిట్టల రవికుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు

Advertisement
 
Advertisement
Advertisement