అక్రమ నిర్మాణాలు తొలగించండి | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలు తొలగించండి

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

కోల్‌సిటీ(రామగుండం): కాలువలపై అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కోరా రు. వార్డు సందర్శనలో భాగంగా బుధవారం మే యర్‌ మహంకాళి స్వామితో కలిసి 51వ డివిజన్‌లోని అశోక్‌నగర్‌, లక్ష్మీనగర్‌లో పర్యటించారు. కా లువలపై అక్రమ నిర్మాణాల వల్ల ప్రవాహ పరిమా ణం పెరిగినప్పుడు నీళ్లు ఇళ్లలోకి రావడం, నీరు నిలిచి దుర్గంధం వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురికావడం జరుగుతుందన్నారు. లక్ష్మీనగర్‌ రోడ్ల ను విశాలంగా తీర్చిదిద్దే ప్రక్రియ సాగుతోందని, త్వరలో గణేశ్‌నగర్‌ వైపు రోడ్డు నిర్మాణం ప్రారంభం అవుతుందని తెలిపారు. కార్పొరేటర్‌ ఆకారపు రేఖ మహేశ్‌, నగరపాలక ఎస్‌ఈ గురువీర, టీపీఎస్‌ నవీన్‌, డీఈ ఆఫ్తాబ్‌, ఏఈ మీర్‌ పాల్గొన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

ప్రతి మహిళను కోటీశ్వరురాలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని 46వ డివిజన్‌ ఇందిరానగర్‌లో బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో కాకుండా తమ ప్రభుత్వం నాణ్యమైన, మన్నికై న చీరలు పంపిణీ చేస్తోందన్నారు. అనంతరం పలువురికి చీరలు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

Advertisement
 
Advertisement
Advertisement