బాధ్యతలు స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరణ

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

పెద్దపల్లి: జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవోగా ఓదెల మండలానికి చెందిన ఆకుల సంజీవ్‌ రావు నియమితులయ్యారు. మంగళవారం ఆ యన బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్‌ రూరల్‌ ఎంపీడీవోగా పనిచేసిన ఆయన ప దోన్నతిపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

నిస్వార్థ సేవలకు నిదర్శనం

కోల్‌సిటీ: గోదావరిఖని గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో మంగళవారం నర్సింగ్‌ డే ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌ అరుణ, ఆర్‌ఎంవో కృపాబాయి కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. వారు మా ట్లాడుతూ.. వైద్య సేవల్లో డాక్టర్ల తర్వాత పే షెంట్లకు నిస్వార్థ సేవలు అందించడంలో న ర్సింగ్‌ అధికారుల పాత్ర కీలకమన్నారు. గ్రేడ్‌– 1 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మర్దిలీనతోపా టు నర్సింగ్‌ సూపరింటెండెంట్లు, హెడ్‌ నర్సింగ్‌ ఆఫీసర్లు, నర్సింగ్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఓపీ సేవలు ప్రారంభం

ధర్మారం: నందిమేడారంలోని 30 పడకల ప్ర భుత్వ ఆస్పత్రిలో ఓపీ సేవలను జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ మంగళవారం ప్రా రంభించారు. శ్రీధర్‌ మాట్లాడుతూ రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను మంత్రి లక్ష్మణ్‌కుమార్‌, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచనల మేరకు ప్రారంభించామన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ప్రసవాల సంఖ్య పెంచాలి

పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల గణనీ యంగా సంఖ్య పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి ప్రమోద్‌కుమార్‌ సూచించారు. తన కార్యాలయంలో ఆశ కార్యకర్తలు, నోడల్‌ సూపర్‌వైజర్లతో మంగళవారం ఆయన సమీక్షించారు. గర్భిణుల వివరాలను ఎర్లీ రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. వేసవిలో వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, శ్రీరాములు, వాణిశ్రీ , సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌, జిల్లా ఆశ నోడల్‌ ఆఫీసర్‌ దయామణి పాల్గొన్నారు.

నేటినుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

పెద్దపల్లి : జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి కల్పన తెలిపారు. రోజూ ఉదయం 9.00 నుంచి మధ్కాహ్నం 12.00 వరకు, మ ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్ట్‌ ఇయర్‌లో 3,664, మంది, సెకండియర్‌లో 1,414 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందు కు దరఖాస్తు చేశారన్నారు. వీరికోసం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.

17న చెస్‌ పోటీలు

ఎలిగేడు: పెద్దపల్లి అమర్‌చంద్‌ కల్యాణమండపంలో ఈనెల 17న వేముల రమణయ్య స్మార క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చెస్‌ పోటీలు నిర్వహించనున్నట్లు చెస్‌ సమాఖ్య జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు గడ్డాల శ్రీనివాస్‌, బజ్జూరి ప్రసాద్‌ తెలిపారు. ఆసక్తి గలవారు ఆదివారం రూ.200 ఎంట్రీ ఫీజుతో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 95153 42207 నంబరులో సంప్రదించాలని వారు కోరారు.

నెలరోజుల్లో మెడికల్‌ బోర్డు

గోదావరిఖని: నెలరోజుల్లో మెడికల్‌ బోర్డు ఏ ర్పాటు చేసేందుకు సింగరేణి అంగీకరించినట్లు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై డైరెక్టర్‌ (పా) చర్చించారు. సొంతింటి పథకం తదితర సమస్యలపై వచ్చే స్ట్రక్చర్‌ మీటింగ్‌లో చర్చించి అమలు, విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారని సీతారామయ్య వివవరించారు.

Advertisement
 
Advertisement
Advertisement