టూరిజం స్పాట్‌గా సబ్బితం | - | Sakshi
Sakshi News home page

టూరిజం స్పాట్‌గా సబ్బితం

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

పెద్దపల్లిరూరల్‌: సబ్బితం(గట్టుసింగారం) జలపా తం పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామ ని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గట్టుసింగారం జలపాతం వద్ద రూ.6కోట్లతో చేపట్టి అభివృద్ధి పనులకు టూరిజం డీఈఈ శ్రీశైలంతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. వానాకాలంలో జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌నలో జలపాతం అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. అనంతరం మున్సిపల్‌, పంచాయతీల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రాసెస్‌ చేసి ముడిసరుకులుగా తయారు చేసేయూనిట్‌ను గౌరెడ్డిపేటలో విప్‌ ప్రారంభించారు. యూనిట్‌ ఏర్పాటుతో కాలుష్యం తగ్గుతుందని అన్నారు. సర్పంచులు సుజాత, సరోజన, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, మార్కెట్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, నాయకులు కొమ్ము శ్రీనివాస్‌, అభిలాష్‌, బండారి రామ్మూర్తి, మందల సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్‌ గుజ్జుల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం

సుల్తానాబాద్‌రూరల్‌: చివరి ఆయకట్టు వరకు సాగురు అందించేలా కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి పెద్దచెరువు నుంచి సాగునీరు వెళ్లే గర్రెపల్లి – బొంతకుంటపల్లి మధ్య గల ఎల్లమ్మ కాలువను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. కాలువను సర్వే చేసి, పూడికతీసి ఐదు గ్రామాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచులు రమేశ్‌గౌడ్‌, శ్రీరంగారావు, తిరుమల్‌రావు, మాజీ ఎంపీటీసీ వెంకటేశం తదితరులు ఉన్నారు.

సుల్తానాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని విప్‌ విజయరమణారావు అన్నారు. అంబేడ్కర్‌ చౌరస్తా – గట్టెపెల్లి రోడ్డు మధ్య చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినిపాల ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు కృష్ణ, వైస్‌చైర్‌పర్సన్‌ అంతటి పుష్పలత ఉన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
 
Advertisement
Advertisement