పెద్దపల్లిరూరల్/పాలకుర్తి: మక్కలను కొనుగోలు చేసిన వెంటనే గోదాములకు తరలించాలని, ఇందుకోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రంగాపూర్‌లో మక్కలు నిల్వ చేసేందుకు 5వేల క్వింటాళ్ల సా మర్థ్యం గల గోదామును అదనంగా సిద్ధం చేశామన్నారు. బుధవారం రంగాపూర్‌తోపాటు పాలకుర్తి మండలంలోని గణపతి ఇండసీ్ట్రస్ గోదామును కలెక్టర్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను వెంటవెంటనే గోదాములను తరలించేందుకు వాహనాలు, హ మాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అప్పన్నపేటలోని ఎస్సారార్ రైస్‌మి ల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వలపై ఆరా తీశారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, పాలకుర్తి తహసీల్దార సునీత్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, రవీందర్ ఉన్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
పెద్దపల్లి: జిల్లాలోని ప్రతీపట్టాదారు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష కోరారు. రైతులు వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయించుకోవాలని ఆయన సూచించారు.
మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలి
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం


