పెద్దపల్లిరూరల్: పట్టణవాసులకు ఆహ్లాదం పంచే లా బంధంచెరువు కట్టను రూ.3.14కోట్లతో మినీట్యాంకుబండ్‌గా సుందరీకరిస్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. బంధంచెరువు అభి వృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్ పూరెళ్ల శైలజ – సుధాకర్, కమిషనర్ వెంకటేశ్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. పలు కార్య క్రమాల్లోనూ పాల్గొన్నారు. ఐటీఐ వాకర్స్ కోసం రూ.10లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌన్సిలర్ కొమ్ము సుధాకర్, తిరుపతి, వెంకటరెడ్డి, ముడుసు సాంబిరెడ్డి తదితరులు ఉన్నారు.


