ఆర్డీవో ఆఫీసుల్లో అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ఆర్డీవో ఆఫీసుల్లో అంతంతే..

May 11 2026 11:50 PM | Updated on May 11 2026 11:50 PM

పెద్దపల్లిరూరల్‌: ఆర్డీవో కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో ఒకేఒక్క ద రఖాస్తు అందింది. కాల్వశ్రీరాంపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం.. ఆస్తి విషయంలో తలెత్తిన వివాదంపై ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. ఈనెల 4న నిర్వహించిన తొ లి ప్రజావాణిలో రెండే అర్జీలు అందాయి. ప్రతీ సోమవారం ఆర్డీవో కార్యాలయంలోనూ ప్రజావాణి నిర్వహిస్తామని ప్రచారం చేయడంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి.

సాగుకు సిద్ధం కావాలి

కమాన్‌పూర్‌: వానాకాలం సాగుకు రైతులు సిద్ధ కావాలని జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అర్చన సూచించారు. గుండారం రైతువేది కలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అర్చన మాట్లాడారు. భూసార పరీక్ష తర్వాతే నివేదిక ఆధారంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు వేయాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్‌ వైనాల రాజు, ఏవో రా మకృష్ణ, ఏఈవో అనుష, రైతులు పాల్గొన్నారు.

అందుబాటులో మందులు

పెద్దపల్లి: జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పితోపాటు వడదెబ్బ నివారణకు అవసరమైన మందులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటు లో ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం వేసవి కా వడంతో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎ క్కువని, బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచి త వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులు, మహిళలెవరూ ఇళ్లనుంచి బయటకు వెళ్లరాదని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ సూచించారు. అత్యవసరమైన వారు ఒక వేళ బయటుకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి రావాల ని సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ సూచించారు.

వేసవి శిబిరాలతో మేలు

ఓదెల: వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో శారద సూచించారు. స్థానిక కేజీబీవీలో సమ్మర్‌ క్యాంపుపై సోమవారం అవ గాహన కల్పించారు. శిబిరాల్లో చెస్‌, యోగా, చిత్ర లేఖనం, డ్యాన్స్‌, మ్యూజిక్‌, కంప్యూటర్‌, స్పీడ్‌ మ్యాథ్స్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. ఎంఈవో రమేశ్‌, ఎస్‌వోలు జ్యోతి, శ్రీదేవి, మంజుల, కల్పన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రేపటి నుంచి కౌన్సెలింగ్‌

పెద్దపల్లి: తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ స్కూల్‌ కు ఎంపికైన విద్యార్థులకు ఈనెల 13, 14వ తే దీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని జిల్లా యువజ న, క్రీడల శాఖ అధికారి సురేశ్‌ తెలిపారు. ఆధా ర్‌, ఎస్సెస్సీ మెమో, స్పోర్ట్స్‌, ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు, 5 పాస్‌పోర్ట్‌ సైజ్‌ఫొటోలు వెంట తీసుకె ళ్లాలని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికై న వారిలో ఆరెల్లి హిమాన్ష్‌,(గోదావరిఖని), క థెరమల్ల శ్రేనిక్‌(అంతర్గాం), కుక్కల శివ కేశవ(అమర్‌నగర్‌, పెద్దపల్లి), పటిబండ్ల వికుల్‌(రామగుండం), గోపతి అనన్య(ఓదెల), తంగెళ్ల శ్రీహిత(సుల్తానాబాద్‌), చెర్ల ఆకాంక్ష(పెద్ద పల్లి) ఉన్నారని, వివరాలకు 99639 60063 నంబరులో సంప్రదించాలని సూచించారు.

జనగణనపై ఆరా

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సోమవారం తొలిదశ జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. 400 మంది ఎన్యుమరేటర్లు హౌస్‌ లిస్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. 60 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు నిర్వహణ తీరు పర్యవేక్షించారు. జనగణన జి ల్లా కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, ఏసీపీ శ్రీహరి, ఫీల్డ్‌ ట్రైనర్‌ అంజన్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement