సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

May 11 2026 11:50 PM | Updated on May 11 2026 11:50 PM

చర్య తీసుకోండి దారి ఇవ్వడంలేదు

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

ప్రజావాణిలో అర్జీల స్వీకరణ

పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను స త్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆ దేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన జిల్లావాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారం కో సం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దని ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జీవో రద్దు చేయాలి

జీవో నంబరు 13ను రద్దు చేయాలి. ఎస్సీ, బీసీ గురుకుల హాస్టల్లో జీవో తో విద్యార్థులు నష్టపోయే ప్రమా దం ఉంది. జీవోను సవరించాలి. ఓపెన్‌ టెండరు ద్వా రా సరుకులు, పౌష్టికాహారం విద్యార్థులకు అందించాలి. – దాసరి ఉష, బీసీ నేత

పెద్దకల్వల భోజన్న చెరువుకు గండిపెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. చెరువులో నీరు ఉండడంతో పశువులకు తాగునీరు లభిస్తుంది. – గుండవేని స్వామి, సలేంద్ర రాములు

నారాయణరా వుపల్లి సర్వే నంబర్‌ 606లో 3.35 ఎకరాల ను ఆక్రమించి పండ్లతోటలు పెంచుతున్నరు. ప్రభుత్వ భూమి అయినా.. అందులో దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

– కాసర్ల మహేందర్‌,

నారాయణరావుపల్లి

Advertisement
 
Advertisement
Advertisement