చిగురిస్తున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న ఆశలు

May 11 2026 11:50 PM | Updated on May 11 2026 11:50 PM

● యథావిధిగా మెడికల్‌ బోర్డు ● సింగరేణిలో ఉద్యోగ, ఉపాధికి భరోసా ● కొత్త గనుల రాకతో మరిన్ని అవకాశాలు

గోదావరిఖని: సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటుతో కార్మిక కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సంస్థ భవిష్యత్‌ కోసం మెడికల్‌ బోర్డును యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్‌తో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో యా జమాన్యం శనివారం సమావేశమైంది. కొత్తగనుల తవ్వకంలో వేగం పెంచామని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొనసాగిస్తామని ప్రకటించింది.

అదనంగా ఉన్నారని..

సంస్థలో ఏడువేల మంది అదనంగా కార్మికులు ఉ న్నారని చెబుతూ మెడికల్‌ పూర్తిచేసుకున్న డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించడంలేదు. దీంతో భవిష్యత్‌లో కొత్త ఉద్యోగాలు కష్టమనే సంకేతాలు వెలువడ్డాయి. ఈక్రమంలోనే సమావేశమైన ఉన్నతాధికారులు.. సంస్థ భవిష్యత్‌పై పలు నిర్ణయాలు తీసుకున్నారు. తొమ్మిది కొత్త గనులు తవ్విస్తామని ప్రకటించారు. దీంతో కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. తద్వారా మెడికల్‌ టెస్ట్‌లు పూర్తిచేసుకొని నిరీక్షిస్తున్న సుమారు 700 మంది డిపెండెంట్ల ఉద్యోగాలకు భ రోసా ఏర్పడినట్లయ్యింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం వెళ్లిన సంస్థ డైరెక్టర్‌(పా) గౌతం పొట్రూ రాక తో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

పట్టుబిగిస్తున్న జేఏసీ

సింగరేణిని ఆర్థికంగా బలోపేతం చేయాలని, రూ.54వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం నుంచి రాబట్టాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. ఈక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూ సీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, టీబీజీకేఎస్‌ ఉద్యమానికి నడుంబిగించాయి.

మెడికల్‌ బోర్డు ప్రారంభంపై..

అనారోగ్యం బారిన పడిన కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే నిలిచిపోయింది. చాలా కుటుంబాలు మెడికల్‌ బోర్డు కోసం ఎదురు చూస్తున్నాయి. నూతన గనుల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, తద్వా రా సుమారు 20ఏళ్లపాటు సంస్థ భవిష్యత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని సింగరేణి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కారుణ్య నియమాకాలకు గ్రీన్‌సిగ్నల్‌ వస్తుందనే ఆశతో కార్మికులు, వారి వారసలు ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement