ఓదెల మల్లన్నకు పూజలు | - | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్నకు పూజలు

May 11 2026 10:01 AM | Updated on May 11 2026 10:01 AM

ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వివిథ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. స్వామివారికి బోనాలతో నైవేద్యం స మర్పించారు. ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు.

అర్హులకు మంచివేతనాలు

ఫెర్టిలైజర్‌సిటీ: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కాంట్రాక్ట్‌ కార్మికు ల్లో అర్హులకు స్కిల్డ్‌ వేతనాలు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. కర్మాగారంలో రెండు రోజులపాటు సమ్మె చేయగా.. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాగూర్‌ మక్కాన్‌సింగ్‌, మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఆ ర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో సంజీవ్‌ గులేటి, మంత్రి శ్రీ ధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మధ్య జరిగి న చర్చలు ఫలించాయి. సెమీస్కిల్డ్‌ కార్మికులకు స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌వారికి సెమీస్కిల్డ్‌ వేతనాలు దశలవారీగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఇతర సమస్యల పరిష్కారానికీ అంగీకారం కుదిరిందని కార్మిక నేత నెలకంటి రాము తెలిపారు. సర్పంచ్‌ ఎరుకల అంజిబాబు, మాజీ సర్పంచ్‌ చిట్టబోయిన రాజ్‌కు మార్‌, నాయకులు కన్నూరి శంకర్‌, కందుల సతీశ్‌, మల్లేశ్‌, మహేందర్‌, సురేశ్‌ ఉన్నారు.

నేడు అప్రెంటిషిప్‌ మేళా

రామగుండం: స్థానిక ఐటీఐ, ఏటీసీలో సోమ వారం అప్రెంటిషిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేందర్‌ తెలిపారు. బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ, బెంగళూరు ఆదర్శ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, హైదరాబాద్‌ రాణే ఇంజిన్‌ వాల్వ్‌ లిమిటెడ్‌, స్కేనిదన్‌ ఎలక్ట్రికల్స్‌, తోషిబా మాన్యుఫాక్చరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఉషా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, రేడియల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వరుణ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(కరీంనగర్‌), హైదరాబాద్‌ ఫాక్సన్‌ ప్రైవేట్‌ లి మిటెడ్‌, సంగారెడ్డి రాణే ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు మేళాకు హాజరుకానున్నాయన్నారు. ఆసక్తి వారు ఉదయం 10 గంటలకు ఐ టీఐకి చేరుకోవాలని, టెన్త్‌, ఐటీఐ, ఆధార్‌కా ర్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, బ్యాంకు పాస్‌బుక్‌, కుల ధ్రువీకరణపత్రం, అప్రెంటిషిప్‌ రి జిస్ట్రేషన్‌ కాపీలతో హాజరు కావాలని కోరారు.

700 శ్లోకాలు కంఠస్థం

కాల్వశ్రీరాంపూర్‌: స్థానిక ఆర్యవైశ్యులు కోలేటి రమాదేవి – రామన్న దంపతులు భగవద్గీత లోని 700 శ్లోకాలు కంఠస్థం చేశారు. దీంతో క ర్నాటక మైసూర్‌లోని శ్రీగణపతి సచ్చితానంద స్వామి ద్వారా ఆదివారం అంతర్జాతీయ మా తృ దినోత్సవం సందర్భంగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాఘవులు, అశోక్‌, ప్రతినిధులు జ్యోతి, వనజ, శోభ, శ్రీలత అభినందించారు.

26న స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఎన్నికలు

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌– 2026– 27 ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 26 న పోలింగ్‌ నిర్వహిస్తారు. జనరల్‌ సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీ, వైస్‌ ప్రెసిడెంట్‌ ఒక్కోటి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల18 నుంచి 20 వరకు రో జూరాత్రి 7 నుంచి రాత్రి 8 గంటల వరకు మ హాత్మాగాంధీ క్రీడా మైదానం కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. 26న ఉదయం 6నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, అదేరోజు ఫలితాలు ప్రకటించనున్నారు. అభ్యర్థులు ఎన్టీపీసీ ఉద్యోగులై ఉండాలి. 2026 ఏప్రిల్‌ 30 నాటికి స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సభ్యత్వం కలిగి ఉండాలి.

విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత

జ్యోతినగర్‌: ఎన్టీపీసీలో ఆదివారం నాలుగు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేశారు. విద్యుత్‌ డిమాండ్‌ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలలుగా ప్రతీనెల కొ న్నిరోజులపాటు యూనిట్లను షట్‌డౌన్‌ చేస్తున్నారు. ఆదివారం ఒకేసారి 4యూనిట్లలో వి ద్యుత్‌ నిలిపివేశారు. తద్వారా రామగుండం ప్రాజెక్టులో 1,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కి నిలిచిపోయింది. తెలంగాణ ప్రాజెక్ట్‌లోని రెండు యూనిట్లనూ సగం లోడ్‌తోనే నిర్వహిస్తున్నారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరగడం, రా ష్ట్రాల నుంచి విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడంతో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించారంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement