తీర్మానం చేయలేదు | - | Sakshi
Sakshi News home page

తీర్మానం చేయలేదు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

ఇటుకబట్టీ యజమానులు చెరువు మట్టి తీసుకెళ్తున్నారనే విషయం నాకు తెలియదు. పంచాయతీ పాలకవర్గం కూడా తీర్మానం చేయలేదు. వనరులను దోచుకొని వెళ్తామంటే చూస్తూ ఊరుకునేదిలేదు.

– సట్టు ఉత్తమ కుమారి, సర్పంచ్‌, కొదురుపాక

నీరుండగానే టెండరా?

ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలు వేసుకుని రెండేళ్లవుతంది. వాటిని పట్టుకోకముందే కొందరు ఇటుకబట్టీ యజమానులు రాత్రివేళల్లో కాల్వతీసి నీటిని బయటకు పంపుతున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. – కొమురయ్య, రాకేశ్‌, మత్స్యకారులు

చెరువే ఆధారం

చెరువు వందలాది కుటుంబాలకు ఆధారం. మత్స్యకారులతోపాటు చెరువు కింద సాగుభూమి అధికంగా ఉంది. అలాంటి చెరువులోంచి మట్టి తరలించుకపోవాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.

– చాతరాజు రమేశ్‌, గ్రామస్తుడు, కొదురుపాక

అనుమతి ఇవ్వలేదు

ముత్తారం చెరువు, సుల్తానాబాద్‌ మండలం కొదురుపాక ఎల్లమ్మచెరువుల్లో 28 వేల క్యూబిక్‌ మీటర్ల వరకు మట్టి తీసుకునేందుకు రెండు దరఖాస్తులు వచ్చాయి. విచారణ చేసి అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం

– శ్రీనివాస్‌, మైనింగ్‌ ఏడీ, పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement