సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

పెద్దపల్లిరూరల్‌: సర్కారు బడుల్లోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతోదంని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నా రు. టెన్త్‌లో 500కుపైగా మార్కులు సాధించిన ప్ర భుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా కేంద్రంలో ఆదివారం యూత్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అభినందించారు. విప్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులు కల్పి స్తున్నామని తెలిపారు. ఎంఈవో సురేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, యువజన కాంగ్రెస్‌ జిల్లా అ ధ్యక్షుడు బొంకూరి అవినాష్‌, కౌన్సిలర్లు గుజ్జుల కు మార్‌, పూదరి మహేందర్‌, మంథని నర్సింగ్‌, న దీం, నాయకులు తూముల సుభాష్‌రావు ఉన్నారు.

పంచాయతీ భవనం ప్రారంభం

సుల్తానాబాద్‌రూరల్‌: దుబ్బపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని విప్‌ విజయరమణారావు ప్రారంభించారు. సర్పంచ్‌ శోభ, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement