గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వ రూరల్ డెవలప్‌మెంట్ జాయింట్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఆదివారం టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్యతో భేటీ అ య్యా రు. గోదావరిఖనిలో మల్లయ్య నివాసానికి వెళ్లిన ఐఏఎస్ అధికారి నరహరి.. ఆయనతో కాసేపు మా ట్లాడారు. నరహరిని మల్లయ్య సాదరంగా ఆహ్వానించి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, సింగరేణిలో బీసీల ప్రాతినిధ్యం గురించి వారిద్దరూ చర్చించారు. సింగరేణిలో టీజీబీకేఎస్ ఏర్పాటుపై నరహరి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నరహరిని సింగరేణి బీసీ సంఘం నాయకులు చిలుక శ్రీనివాస్, దీటి చంద్రమౌళి ఘనంగా సన్మానించారు. నాయకులు దొడ్ల సతీశ్, పైండ్ల మహేందర్, కాసిపేట రవి, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.


