ముత్తారం: బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో శనివారం మంత్రి ఇందిరమ్మ గృహప్రవేశం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను హింసాత్మకం చేస్తున్నారని విమర్శించారు. గూండాయిజం, రౌడీయిజంతో కొట్లాడుకుంటూ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని అరోపించా రు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, బీ జేపీ మిత్ర పక్షంగా ఉంటూ అధికారం లేకపోవడంతో అల్లర్లు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ పేదలకు గూడు ఇవ్వలేక మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన
కమాన్‌పూర్/మంథనిరూరల్/రామగిరి/ముత్తారం: మంత్రి శ్రీధర్‌బాబు మంథని డివిజన్‌లో పర్యటించారు. తొలుత మంథని–పెద్దపల్లి మధ్య కమాన్‌పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నిర్మిస్తున్న బస్సు సెల్టర్ పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్, కమాన్‌పూర్, గుండారం వార్డు సభ్యులు గొడిసెల లింగస్వామి, పిడుగు సదయ్య, నాయకులు భూంపెల్లి రాజయ్య, లల్లూ ఉన్నారు. మంథని మండలం సూరయ్యపల్లిలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి సహిత బొడ్రాయి ప్రతిష్ఠాపన, పోచమ్మ కొలుపులో మంత్రి శ్రీధర్‌బాబు పూజలు చేశారు. సర్పంచ్ ఆర్ల నాగరాజు, ఉపసర్పంచ్ ఆరెల్లి సుచిత – వరుణ్‌గౌడ్ తదితరులు ఉన్నారు. రామగిరి మండలం బేగంపేట గ్రామస్తులు దాసరి శివ, కుంట బక్కయ్య, బొంతల రమేశ్, రుద్రవేణ మల్లేశ్, కట్టగోని పోచాలు, అంకితి కుమార్, అబ్రార్ గోగుల శంకర్, ఏట రమేశ్, జెట్టవేన రంజిత్, పోతరవేన శంకర్, బందారపు కుమార్ తదితరులు మంత్రిని శాలువాతో సన్మానించారు. అనంతరం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో జరిగిన ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ ఎంపీటీసీ గీతారాణి, గీత కార్మికులు దేశిని రాజేశం, గట్టు సదయ్య, వీరగోని అంజి, గట్టు మహేశ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


