స్వీయ జనగణనలో పాలుపంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయ జనగణనలో పాలుపంచుకోవాలి

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

● కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి

కోల్‌సిటీ(రామగుండం): స్వీయ జనగణనలో ప్రతీ కుటుంబం తమ వివరాలు నమోదు చేసుకోవాలని రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి సూచించారు. స్వీయ జనగణనపై అవగాహన కల్పించేందుకు శనివారం బల్దియా కార్యాల యం శనివారం 2కే రన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్యుమరేటర్లు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. చౌరస్తా వరకు సాగిన ఈ కార్యక్రమంలో తె లంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలు, ఆటలతో అవగాహన కల్పించారు. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌(ఏసీపీ) శ్రీహరి పలు అంశాల గురించి వివరించారు. స్వీయ జనగణన ప్రక్రియ నీనెల 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. https://se. census.gov.in/⁠ వెబ్‌సైట్‌లో తమ వివరాలను సులభంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో బల్దియా కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు ఆంజనేయులు, శ్రీనివాస్‌, అకౌంటెంట్‌ రవితేజ, ఎన్యుమరేటర్లు అంజన్‌కుమార్‌, స్వరూప్‌చంద్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ మధుకర్‌, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement