● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి/సుల్తానాబాద్‌రూరల్: రైస్‌మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలోని అన్నపూర్ణ, పెద్దకల్వలలోని రాధాకృష్ణ, సుల్తానాబాద్, పూసాల కల్యాణి, పరమేశ్వర రైస్ మిల్లులను శనివారం ఆయన తనిఖీ చేశారు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్, నిల్వలు, ట్యాబ్‌లో ఎంట్రీ, ట్రక్‌షీట్ల జనరేషన్ తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, అధికారి శ్రీనాథ్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, రైస్ మిల్లు యజమాని పన్నాల రాములు పాల్గొన్నారు.


