జ్యోతినగర్: ప్రతిష్టాత్మక కేన్స్ ఇండియా ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎన్టీపీసీకి చెందిన రష్మీ ఠాకూర్ ఎంపికయ్యా రు. ఆమె చేనేత ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. ఈమేర కు కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్– 2026లో తెలంగాణ చేనేత, భౌగోళిక గుర్తింపు పొందిన పో చంపల్లి ఇక్కత్ వస్త్రాలు ప్రదర్శిస్తారు.
బస్టాండ్ చౌరస్తా విస్తరణ
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బ స్టాండ్ అంబేడ్కర్ చౌరస్తా విస్తరణ పనులను మున్సిపల్ చైర్మన్ మల్లయ్య శుక్రవారం ప్రారంభించారు. దీనికి సమీపంలో త్వరలోనే బస్సుడి పో ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాకపోక లకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ విప్ విజయరమణారావు కలెక్టర్‌తో చర్చించి ప్రత్యేకంగా రూ.39లక్షలు కేటాయించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్, టీపీవో వినయ్, వార్డు ఆఫీసర్లు కుమార్, యశ్వంత్, సాగర్, అరవింద్, సురేశ్ తదితరులు ఉన్నారు.
12నుంచి పునశ్చరణ క్లాసులు
పెద్దపల్లిరూరల్: టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ క్లాసెస్ (పునశ్చరణ తరగతులు) నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేసింది. అప్పన్నపేట, రామగుండంలో (పీఎంశ్రీ పాఠశాలలు) కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా 178 మంది ఫెయిల్ అయ్యారు. ఆయా సబ్జెక్టులను బోధించేందుకు ఈనెల 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రత్యేక పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఐటీఐలో ప్రవేశాలు
పెద్దపల్లి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు, ఏటీసీల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ బుసిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 14 నుంచి జూన్ 8 వ తేదీ వరకు రూ.100 వెరిఫికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు పవర్ కట్ ప్రాంతాలు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని గుండంక ట్ట సబ్‌స్టేషన్ పరిధిలోని ఫీడర్ మరమ్మతుల నే పథ్యంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ తెలిపా రు. తిలక్‌నగర్, గుండమ్మకట్ట, కంచరబావి, శంకర్‌గంజ్, జెండాచౌరస్తా, కోటి కాంప్లెక్స్, సాగర్‌రోడ్డు, పైడబజార్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఫెర్టిలైజర్‌సిటీ: కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆర్‌ఎఫ్‌సీఎల్ అ ల్లాయిడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నెల కంటి రాము ఆధ్వర్యంలో రెండురోజులుగా కొ నసాగుతున్న సమ్మెలో శుక్రవారం విరమించా రు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మ క్కాన్‌సింగ్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్‌బాబు తో చర్చించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులతో నూ చర్చలు జరపడంతో యాజమాన్యం సా నుకూలంగా స్పందించింది. మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్ల య్య, నాయకులు కన్నూరి శంకర్, కందుల స తీశ్, బెంద్రం రాజిరెడ్డి, ఎరుకల అంజిబాబు, చిట్టబోయిన రాజ్‌కుమార్, మల్లేశ్ ఉన్నారు.
చేపల ఉత్పత్తిపై అవగాహన
పెద్దపల్లి: చెరువుల్లో కలుపు నివారణ పద్ధతు లు, చేపల ఉత్పత్తిపై జిల్లా మత్స్య శాఖాధికారి నరేశ్ కుమార్ నాయుడు అవగాహన కల్పించా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం శ్రీచెరువుల్లో కలుపు నివారణ, వ్యాధుల నియంత్రణ, చేపల ఉత్ప త్తి పెంపుపై వివరించారు. మత్స్య కళాశాల (పెబ్బేరు) నుంచి జ్ఞానేశ్వర్, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
80 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణత
పెద్దపల్లి: టెన్త్ ఫలితాల్లో జిల్లాలోని 80 ప్రభు త్వ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించా యి. ఇందులో జెడ్పీ హైస్కూల్స్ 55, కేజీబీవీ లు 8, మోడల్ స్కూల్స్ 7, ప్రభుత్వ హైస్కూ ల్స్ 4, బీసీ వెల్ఫేర్‌లు 6 ఉ న్నాయి. జిల్లాలో 10 కేజీబీవీలు ఉండగా అందులో 8వందశాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలిచాయి.


