సింగరేణిలో సమ్మె మేఘాలు | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో సమ్మె మేఘాలు

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

పాత పద్ధతిలోనే మెడికల్‌బోర్డును కొనసాగించాలి

డిపెండెంట్లు, మారుపేర్లు, డిస్మిస్‌ కార్మికులకు ఉద్యోగాలివ్వాలి

పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌, సొంతింటి పథకం అమలు చేయాలి

జేఎంఈటీలకు రెండేళ్లకే తప్పనిసరిగా పదోన్నతి కల్పించాలి

సింగరేణికి ప్రభుత్వం బకాయిపడిన రూ.54వేల కోట్లు వెంటనే చెల్లించాలి

విజిలెన్స్‌ పేరిట పెండింగ్‌లో పెట్టిన కార్మికుల డిపెండెంట్లకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ తక్షణమే చేయాలి

పదోన్నతులు, క్వార్టర్ల అలాట్‌మెంట్‌ లోని సమస్యలు పరిష్కరించాలి.

గోదావరిఖని: సింగరేణి కార్మికు సమస్యల పరిష్కారానికి యూనియన్‌ నేతలు సమ్మెబాట ఎంచుకున్నాయి. కారుణ్య నియామకాలు, మెడికల్‌ ఇన్వాలిడేషన్‌, మారుపేర్లు, విజిలెన్స్‌ పెండింగ్‌ కేసులు, సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ మాఫీ తదితర సమస్యలపై ఆందోళనకు సమాయత్తమవుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థలో సుమారు 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.

సమస్యలు – కార్మికుల అసంతృప్తి

సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియ రెండేళ్ల క్రితమే నిలిచిపోయింది. 11వ వేజ్‌బోర్డు అమలులో ఆలస్యం అవుతోంది. మిగతా సమస్యల గురించి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది.

అదనపు కార్మికుల పేరుతో ప్రచారం

సింగరేణిలో ఇప్పటికే అదనంగా సుమారు 7వేల మంది కార్మికులు ఉన్నారని యాజమాన్యం ప్రచా రం చేస్తోంది. వారికే పనిలేకుంటే కొత్తవారిని ఎలా నియమించుకునేదని ప్రశ్నిస్తోంది. కార్మిక సంఘా లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. శాశ్వత కార్మి కులతో పోలిస్తే కాంట్రాక్ట్‌ కార్మికులకు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలు వేధిస్తున్నాయని కార్మిక నేతలు మండిపడుతున్నారు.

సమ్మైసెరన్‌ మోగిస్తాం..

సమస్యల విషయంలో సింగరేణి యాజమాన్యం స్పందించకపోతే సమ్మైసెరన్‌ మోగిస్తామని గుర్తింపు సంఘం ఇప్పటికే నోటీసులు జారీచేసింది. గుర్తింపు యూనియన్‌తోపాటు పలు కార్మిక సంఘాలు సింగరేణి తీరుపై గుర్రుగా ఉన్నాయి. ఈక్రమంలో సింగరేణిలో వాతావరణం వేడెక్కింది.

ప్రభుత్వం, యాజమాన్యం స్పందిస్తాయా?

తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సింగరేణి బొగ్గు గనుల సంస్థది కీలకపాత్ర. సమ్మె జరిగితే బొగ్గు, విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం రంగంలోకి దిగాలని పలువురు కోరుతున్నారు.

భవిష్యత్‌ కార్యాచరణపై జేఏసీ భేటీ..

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలన్నీ ఏకమైయ్యాయి. నాలుగు రోజుల క్రితం గోదావరిఖనిలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో బీఎంఎస్‌ మినహా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, టీబీజీకేఎస్‌ సమావేశమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించాయి. మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించాయి.

డిమాండ్లు ఇవే..

సమస్యల పరిష్కారానికి పోరుబాట

సన్నాహాల్లో వివిధ కార్మిక సంఘాలు

Advertisement
 
Advertisement
Advertisement