గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని, నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. బక్రీద్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నియంత్రణ, నిబంధనల అమలుపై శుక్రవారం కమిషనరేట్‌లో స్లాటర్ హౌస్ నిర్వాహకులుతో సమావేశమయ్యారు. బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. రవాణా సమయంలో జంతువులకు సంరక్షణ కల్పిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అనుమతి లేని ప్రదేశాల్లో జంతువుల వధ, మాంసం విక్రయాలు, ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వ్యవహరించడం, సోషల్ మీడియాలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు, వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని అన్నారు. అడిషన ల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీ నాగేంద్రగౌడ్, బెల్లంపల్లి రూరల్, మంచిర్యాల పట్టణ, స్పెషల్ బ్రాంచ్ సీలు హనూక్, ప్రమోద్‌రావు, భీమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం సీపీ అంబర్‌కి శోర్ ఝా


