సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశాలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ ఆదేశాలు

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

రామగిరి: రామగుండం–3 ఏరియా ఓసీపీ–2 విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోతున్న రాజాపూర్‌వాసుల సమస్యలు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌, రాజాపూర్‌ సర్పంచ్‌ పుల్లెల భాగ్యలక్ష్మి గత నెల 28న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈమేరకు తహసీల్దార్‌, ఆర్జీ–3 జీఎంకు ఆదేశాలు జారీచేశారు. కాగా, నాగెపల్లిలో చేపట్టిన కాలువ డైవర్షన్‌ బ్లాస్టింగ్‌ పనులతో ప్రమాదాలు జరగకుండా భద్రత చర్యలు చేపట్టాలని తొట్ల తిరుపతి యాదవ్‌, సర్పంచ్‌ కొండవవేన దివ్య సూచించారు. కెనాల్‌ డైవర్షన్‌ బ్లాస్టింగ్‌ పనులను ఓసీపీ–2 పీవో రాజశేఖర్‌తో కలిసి శుక్రవారం వారు పరిశీలించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రొడ్డ బాపు, మాజీ సర్పంచులు తీగల సమ్మయ్య, ఎరుకల బాబురావు, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు తీగల సదయ్య, వేగొలపు సంతోష్‌, భద్రపు శీను, మైలారపు అనిల్‌, పిట్టల అనిల్‌, మల్యాల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement