పెద్దపల్లి: స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, రుణ పంపిణీ, రికవరీ అంశాల్లో జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. గురువారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్‌డీవో కాళిందిని, రవీందర్ అవార్డు స్వీకరించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో అధిక శాతం సాధించడంతో పెద్దపల్లి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 7,716 స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం నిర్దేశించగా, 6,851 సంఘాలకు అనుసంధానం చేసి రూ.454.66 కోట్లు లింకేజీ సాధించడం ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
అవార్డుకు కారణాలు
బ్యాంకుల నుంచి రుణ అనుసంధానం పెరగడం, సంఘాల రీ పేమెంట్ క్రమబద్ధంగా ఉండడం, ఎన్‌పీఏ కేవలం 0.85 శాతం స్థాయిలో ఉండడం జిల్లాను అగ్రస్థానంలో నిలిపాయి.
మహిళా సాధికారతకు దన్ను
స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందడం వల్ల గ్రామీణ మహిళలకు చిన్న వ్యాపారాలు, జీవనోపాధి మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. బ్యాంకు లింకేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో రుణాలు తీసుకునే సామర్థ్యం మాత్రమే కాదు, వాటిని తిరిగి చెల్లించే నమ్మకం కూడా పెరుగుతోంది.
మంత్రి సీతక్క
చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న అధికారులు
సీ్త్ర నిధి మహిళా బ్యాంకు ద్వారా కూడా రుణాల పంపిణీ, రికవరీలో జిల్లా మంచి పనితీరు కనబరిచింది. దీంతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ విజయంలో ఫీల్డ్ స్థాయి సిబ్బంది, సమాఖ్య నాయకత్వం, జిల్లా యంత్రాంగం సమష్టి కృషి ప్రధానంగా నిలిచింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సైతం నాలుగు విభాగాల్లో రాష్ట్రస్థాయిలో సత్తాచాటి మన్ననలు పొందింది.
సీ్త్ర నిధి పనితీరు


