ఎల్లమ్మ ఆలయంలో పూజలు | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ ఆలయంలో పూజలు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

ధర్మారం: స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయంలో సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నె ల 29న గంగస్నానం ఉత్సవాలతో ప్రారంభ మై వేడుకలు బుధవారం ముగిశాయి. ఆలయ కమిటీ చైర్మన్‌ పాలకుర్తి రాజేశంగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లావుడ్య రూప్లానాయక్‌, వైస్‌ చై ర్మన్‌ అరిగే లింగయ్య, నాయకులు కొత్త నర్సింహం, దేవి లావణ్య, ఓరం చిరంజీవి, మందపెల్లి మల్లేశం, ఎల్లయ్య, కాంపెల్లి రాజేశం, జనగామ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఈఎస్‌ఐసీ మేనేజర్‌గా శ్రీకర్‌

జ్యోతినగర్‌: రామగుండం ఈఎస్‌ఐసీ బ్రాంచి మేనేజర్‌గా ఆర్‌.శ్రీకర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణానగర్‌లోని ఈఎస్‌ఐసీ కా ర్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన శ్రీకర్‌ బాధత్యలు చేపట్టారు. ప్రస్తుత బ్రాంచి మేనేజర్‌ ఖగేశ్వరరావు వరంగల్‌ ఈఎస్‌ఐసీ కేంద్ర కార్యాలయానికి బదిలీ అయ్యారు. శ్రీకర్‌కు పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

కుదిరిన ఒప్పందం

పెద్దపల్లిరూరల్‌: స్థానిక మదర్‌ థెరిసా ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యంతో ఇన్ఫోమాటిక్‌ రీ సెర్చ్‌ల్యాబ్‌ బుధవారం ఎంవోయూ కుదుర్చుకుంది. తద్వారా మదర్‌ థెరిసా విద్యార్థులకు ఇన్ఫోమాటిక్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌లోని అన్నివనరు లు, వర్క్‌షాప్‌లను వినియోగించుకునేందకు అవకాశం లభించినట్లయ్యింది. డైరెక్టర్‌ ఎడవల్లి నవత, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ఇన్ఫోమాటిక్‌ రీజినల్‌ హెడ్‌ వంశీకృష్ణ ఒప్పందపై సంతకాలు చేశారు. ఏవో పవన్‌కుమార్‌, ప్లేస్‌మెంట్‌ అధి కారి వెంకటేశ్వర్లు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

సైకిల్‌ ఆరోగ్య సాధనం

జ్యోతినగర్‌: సైకిల్‌ ఆరోగ్య సాధనమని సైక్లింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర పరిశీలకుడు సురభి వేణుగోపాల్‌ అన్నారు. ఎన్టీపీసీ శ్రీమయు గ్రాండ్‌లో సైక్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా జనరల్‌ బాడీ స మావేశం బుధవారం జరిగింది. ఆయన మా ట్లాడుతూ, సైక్లింగ్‌తో శరీరంలోని ప్రతీఅవయ వం ఉత్తేజంగా పనిచేస్తుందన్నారు. అనంతరం అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా అసంపెల్లి వా సు, ప్రధాన కార్యదర్శిగా టి.శంకర్‌ ఉపాధ్యక్షులుగా అంబంటి సంతోష్‌రావు, కొమురోజు శ్రీ నివాస్‌, టి.రాజ్‌కుమార్‌, జాయింట్‌ సెక్రటరీలుగా సహజ రాజేందర్‌, జూపల్లి తిరుమలరా వు, కొయ్యడ శ్రీనివాస్‌ యాదవ్‌, కోశాధికారిగా గడ్డం శ్యామ్‌ కుమార్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు.

13 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

పెద్దపల్లి: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి నిర్వహిస్తామని జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ ఆఫీసర్‌ కల్పన తెలిపారు. అదనపు కలెక్టర్‌ వేణు, అధికారులతో కలిసి బుధవారం పరీ క్షల నిర్వహణపై సమీక్షించారు. ఈనెల 21వ తే దీవరకు రోజూ ఉదయం 9.00 – మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల – సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయన్నారు. 5,078 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

యూరియా ఉత్పత్తిలో కీలకం

ఫెర్టిలైజర్‌సిటీ: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తెలుగు రాష్ట్రాల్లో యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్లాంట్‌ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేయాల్సి ఉంది. 2026–27లో వార్షిక లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఏప్రిల్‌లో 98,307.18 మెట్రిక్‌ టన్ను ల యూరియా ఉత్పత్తి చేసింది. ఇందులో మనరాష్ట్రానికి 65 శాతం సరఫరా చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement