చిన్న గాలిదుమారానికే ఇళ్లు, రహదారులు, వాడలు, ఊరంతా బూడిద నిండుతోందంటున్నారు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వాసులు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాఘవాపూర్‌లో రాహదారికి ఇరువైపులా ఇటుకబట్టీలు ఉన్నాయి. వాయుకాలుష్యం వెదజల్లుతున్నాయి. ప్రజావాణిలో పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటుకబట్టీలను గ్రామానికి దూరంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బుధవారం సాయంకాలం ఒక్కసారిగా పెద్దఎత్తున గాలులు వీయడంతో రహదారి, ఊరు బూడిదపొగతో నిండిపోయి ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


