నేడు ‘అల్ట్రాటెక్‌’ పర్మినెంట్‌ కార్మిక సంఘం ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

నేడు ‘అల్ట్రాటెక్‌’ పర్మినెంట్‌ కార్మిక సంఘం ఎన్నికలు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

పాలకుర్తి: బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ పర్మినెంట్‌ కార్మికసంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ప్రత్యక్ష బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నుకుంటారు. అధ్యక్ష స్థానానికి ముగ్గురు బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ నుంచి అధ్యక్షుడిగా బయ్యపు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పోతుల ప్రసాద్‌, అధ్యక్ష స్థానానికి మరో అభ్యర్థి మల్క రామస్వామి, ప్రధా న కార్యదర్శిగా రమేశ్‌ మౌర్య పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి నల్ల మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జేసీబీ శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయకపోవడం విశేషం. బయ్యపు మనోహర్‌రెడ్డి ప్యానెల్‌కు ఆటో, మల్క రామస్వామి ప్యానెల్‌కు చేతిలో చేయి, నల్ల మనోహర్‌రెడ్డి ప్యానెల్‌కు గులాబిపువ్వు గుర్తులు కేటాయించారు. కంపెనీలో 307 మంది పర్మినెంట్‌ కార్మికులు ఉన్నారు. నామినేటేడ్‌ ఎన్నికల అధికారి బద్దం డానియల్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌ అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అర్ధగంట విరామం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

19లోగా ఫీజు చెల్లించాలి

గోదావరిఖనిటౌన్‌: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థులు ఈనెల 19వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్‌ సుబ్బారావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జైకిషన్‌ ఓజ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవత్సరం 2వ, ద్వితీయ సంవత్సరం 4వ, తృతీయ సంవత్సరం విద్యార్థులు 6వ సెమిస్టర్‌ పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాల్లో చెల్లించాలన్నారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.150, బీఎస్సీ సైన్స్‌, బీకాం కంప్యూటర్స్‌కు అదనంగా ల్యాబ్‌ ఫీజు చెల్లించాలని కోరారు. జూన్‌ 14 నుంచి జూలై 06వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.

అవసరం మేరకే ఎరువులు వాడాలి

మంథనిరూరల్‌: అవసరానికి మించి పంటలకు ఎరువులు వాడితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని జగిత్యాల వ్యవసాయ కళాశాల పొలాస శాస్త్రవేత్తలు అరుణ్‌కుమార్‌, శ్రావణ్‌ తెలిపారు. చిల్లపల్లిలో సర్పంచ్‌ గోపు సంతోష్‌కుమార్‌ అధ్యక్షతన బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. రైతులు నీటిని ఆదా చేసుకోవడంతోపాటు యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు. వరి మొక్కజొన్న, పత్తి కోసిన తర్వాత అవశేషాలను కాల్చవద్దని అన్నారు. కార్యక్రమంలో బెస్తపల్లి స ర్పంచ్‌ అరిపెల్లి శ్రీనివాస్‌, చిల్లపల్లి ఉపసర్పంచ్‌ రా ణి, ఏఈవో శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement