పెద్దపల్లిరూరల్: రైతుల కష్టం గురించి తెలుసని, వారికి ఏం చేయాలో తెలిసిన సంక్షేమ ప్రభుత్వం త మదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూరమల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతువారోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోందని, ఇది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు నిందారోపణలు చేస్తున్నాయని విప్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కమొక్కజొన్న గింజ కూడా కొనలేదని దుయ్యబట్టారు. కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ రైతులపై కపటప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. రైతులు లాభదాయకమైన ఆయిల్‌పాం, అపరాల సాగువైపు దృష్టి సారించాలని విజయరమణారావు అన్నారు. పంట మార్పిడి విధానాన్ని పాటిస్తే మంచిదిగుబడులను సైతం సాధించవచ్చని తెలిపారు. ఆయిల్‌పాం సాగుతో దీర్ఘకాలంగా ఆదాయం పొందే వీలుందని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం రాయితీ కూడా అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, డీసీవో శ్రీమా ల, మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కాన్‌నాజ్ నయ్యర్, కౌన్సిలర్లు, సీఈవోలు తదితరులు పాల్గొన్నారు.
ఓర్వలేకనే దిగజారుడు విమర్శలు
ప్రభుత్వ విప్ విజయరమణారావు


