నాలాలు కబ్జా చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాలాలు కబ్జా చేస్తే చర్యలు

May 7 2026 9:32 AM | Updated on May 7 2026 9:32 AM

జ్యోతినగర్‌: స్వచ్ఛ రామగుండం నిర్మాణంలో ప్రజ లు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ కోరారు. 31వ డివిజన్‌లో బుధవారం ఆయన వార్డుబాట చేపట్టారు. మేయర్‌ మహంకాళి స్వామి, కార్పొరేటర్‌ షహేదా ఆసిఫ్‌పాషా హాజరయ్యారు. శిథిలమైన రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి స రఫరా తదితర సమస్యల గురంచి స్థానికులు ఎమ్మె ల్యే, మేయర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే చర్య లు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నాలాలు కబ్జా చేస్తే స్థానికులు అడ్డుకోవాలని కోరారు. మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంగల బాపు, కొలని కవితారెడ్డి, భూలక్ష్మి, నాయకులు ముచ్చకుర్తి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ రామగుండంలో ప్రజలు భాగస్వాములు కావాలి

ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement