సన్న, చిన్నకారు రైతుల కోసం ప్రభుత్వ కల్యాలలు నిర్మించాలి. రైతులు నిర్మించుకునేలా 100 శాతం సబ్సిడీ వర్తింపజేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన నిధులు కేటాయించాలి.
– గెల్లు శ్రీనివాస్, రైతు, సుల్తానాబాద్
నిధులు కేటాయించాలి
సన్న, చిన్నకారు రైతులు కల్లాలు నిర్మించుకునేలా నిధులు కేటాయించాలి. గతంలో పొలాలు, పెరట్లో కల్లాలు ఉండేవి. భూముల ధరలు పెరగడంతో ఖాళీస్థలాలు అమ్ముకున్నారు. భూముల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం, మక్కలు, మిర్చి, పప్పుదినుసులు రోడ్లపై పోయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి.
– రాజన్న పటేల్, రైతు, పెద్దపల్లి


