నేడు మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు మెగా జాబ్‌మేళా

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

పెద్దపల్లి: స్థానిక వెంకటపద్మావతి ఏసీ కన్వెన్షన్‌హాల్‌లో బుధవారం జరిగే మెగా జాబ్‌మేళా కు అన్నిఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహ ర్ష తెలిపారు. 20 స్థానిక, 48 స్థానికేతర సంస్థలు సుమారు 3439 ఉద్యోగావకాశాలు క ల్పించేందుకు మేళాకు హాజరవుతాయన్నారు. ఎస్సె స్సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫా ర్మసీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ కోర్సులు పూర్తిచేసి న వారు అర్హులన్నారు. ఆసక్తిగలవారు రెజ్యూమ్‌, ఆధార్‌, డీఈఈటీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుని హాజరు కావాలన్నారు.

ఆర్థికాభివృద్ధి సాధించాలి

కోల్‌సిటి: మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదిగేందుకు మార్పులను ఎప్పటికప్పడు గ మనిస్తూ నైపుణ్యం పెంపొందించుకుని ఆర్థికాబివృద్ధి సాధించాలని అడిషనల్‌ కలెక్టర్‌ అరుణ శ్రీ సూచించారు. విద్యార్థుల యూనిఫామ్‌ కు ట్టడంలో నైపుణ్యం పెంపొందించడానికి జమ్మికుంట శిక్షణ కేంద్రంలో విజయవంతంగా శిక్ష ణ పూర్తిచేసుకున్న 50 మంది స్వశక్తి మహిళల కు రామగుండం బల్దియాలో మంగళవారం ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ, టైలరింగ్‌ వృత్తిలో ఉన్న మహిళలను గుర్తించి వృత్తి నైపుణ్యం మెరుగుపరచడానికి శిక్షణ అందించామన్నారు. బల్దియా కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలతోపాటు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ కో ఆర్డినేటర్‌ శరత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

బాలికాసాధికారతకు కృషి

జ్యోతినగర్‌: బాలికాసాధికారతకు ఎన్టీపీసీ ని రంతరం కృషి చేస్తుందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత, దీప్తి మహి ళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నా రు. ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో మంగళవారం బాలికా సాధికారత మిషన్‌–2026 ని ర్వహించారు. ఈడీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదివే బాలికలకు వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ అందించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఏజీఎం సాగర్‌ రంజన్‌ సాహూ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు

పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీగా ఉ న్న డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీ ధర్‌ తెలిపారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ రెండు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(ఎంబీబీఎ స్‌) మూడు పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు బయోడేటా, విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఒకసెట్‌ జిరాక్స్‌తో ఆస్పత్రిలో నేరుగా హాజరు కావాలన్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(స్పెషలిస్టు)కు నెలకు రూ.లక్ష, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌కు రూ.52,351 వేతనం చెల్లిస్తారన్నారు. వివరాలకు 94924 57809 మొబైల్‌ నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

రేపు అథ్లెటిక్స్‌ పోటీలు

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో ఈనె ల 7న జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహిస్తామని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కొమ్ము గట్టయ్య తెలిపారు. అండర్‌–08, 10, 12, 14,16,18, 20 విభాగాల్లో బాల, బా లికలు, మహిళలు, పురుషులకు పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తగిన ధ్రువీకరణపత్రాలతో క్రీడా మైదానంలో ఉద యం 6.30 గంటలకు హాజరుకావాలని సూ చించారు. వివరాలకు అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి ఎంసుధేశ్‌, 94404 24640 నంబరులో సంప్రదించాలని ఆయనపేర్కొన్నారు.

రోడ్డు పనులు పూర్తిచేయాలి

జ్యోతినగర్‌/గోదావరిఖని: రాజీవ్‌ రహదారి సర్వీస్‌ రోడ్డు పనులను పూర్తిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ సూచించారు. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డు, మే డిపల్లి సెంటర్లలో మంగళవారం పర్యటించా రు. ఈ సందర్భంగా చల్లని పండ్లరసం తాగి సే దదీరారు. బాపూజీనగర్‌లో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలి ఆస్తి నష్టపోయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన సతీమ ణి మనాలిఠాకూర్‌ బాధితులకు ధైర్యం చెప్పా రు. అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్‌ నేత తిప్పారపు శ్రీనివాస్‌ను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement