మిట్ట మధ్యాహ్నం.. భగ్గుమంటున్న సూరీడు.. భూమిలో మట్టి పోయకుండా కాపలాకాస్తున్న సుందిళ్ల గ్రామస్తు లు వీరు. ఎస్.కాకయ్యకు 1987లో సర్వేనంబరు 387/7లో 1.20 ఎకరాలకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అప్పట్నుంచి సాగులోనే ఉంటోంది. ఓసీపీ–5 విస్తరణ కోసం ఆయన భూమిని సింగరేణి సేకరించింది. అయితే, 1.20 ఎకరాలకు బదులు 9 గుంటలే ఉందని రూ.3,02,444 పరిహారం అందిస్తామని సింగరేణి చెప్పింది. మొత్తం భూమికి పరిహారం ఇచ్చాకే తమ భూమిలో మట్టిపోయాలని వేడుకుంటూనే మట్టి పోయకుండా కనకయ్య కుటుంబ సభ్యులు వంతుల వారీగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు మట్టి కుప్పల వద్ద ఇలా కాపలా కాస్తున్నారు.


