వైద్యసేవలు మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలు మెరుగుపర్చాలి

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో వైద్య సేవలను మెరుగుపరచాలని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, పిల్లల విభాగంలో ఓపీ, ఐపీ సేవలను బలోపేతం చేయాలన్నారు. డాక్టర్లు కృపాబాయి, శిరీష, రాజు పాల్గొన్నారు.

సృజనాత్మకత అవసరం

గోదావరిఖనిటౌన్‌: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ సృజనాత్మ కత పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ సూచించారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టీ ఫైబర్‌, సూపర్‌ టీచర్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌ గాంధీపార్క్‌ స్కూల్‌లో సోమవారం సూపర్‌ సమ్మర్‌ కంప్యూటర్‌, ఏఐ, రోబోటిక్స్‌ లర్నింగ్‌ ప్రోగ్రాంను అరుణశ్రీ ప్రా రంభించి మాట్లాడారు. ఎంఈవో మల్లేశం, డీ ఆర్పీ రవి, హెచ్‌ఎం రాంబాబు, స్వరూప్‌చంద్‌, రమేశ్‌, పీఆర్సీ శ్రీలత పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎప్‌సెట్‌

రామగిరి: పన్నూర్‌లోని మంథని జేఎన్టీయూ లో సోమవారం ఎప్‌సెట్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు అగ్రికల్చర్‌, ఫార్మసీ వి ద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 80 మందికి 73 మంది, మధ్యాహ్నం 80 మందికి 67 మంది హాజరయ్యారు. మెకానికల్‌ ప్రొ ఫెసర్‌ చెరుకు శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్‌ బందోబస్తు చేపట్టారు.

తొలి ప్రజావాణికి స్పందన

పెద్దపల్లిరూరల్‌: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి ప్రారంభమైంది. తొలిరోజు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (డీఏవో)సువర్ణ రెండు దరఖాస్తులను స్వీకరించారు. ధర్మా రం మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన యశోద రాజనర్సు అనే రైతు తాను సాదాబైనామాతో కొనుగోలు చేసిన భూమిని వేరొకరి పే రిట అక్రమంగా పట్టాచేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. పెద్దపల్లిలోని తన ఇంటి నంబరు వేరొకరి పేరిట ఉందని, దానిని సవరించాలని శ్యామల కోరారు.

‘నెఫీ’ ఆవిర్భావ దినోత్సవం

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ ఫెఢరేషన్‌ ఆ ఫ్‌ ఇండియా(నెఫీ) ఆవిర్భావ దినోత్సవం సో మవారం ఘనంగా నిర్వహించారు. పర్మినెంట్‌ టౌన్‌షిప్‌లోని దిశా భవనంలో జరిగిన కార్యక్రమంలో నెఫీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర జాట్‌, చైర్మన్‌ కుమార్‌ దేవాశిష్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేసి సంబరాలను ప్రాంరభించారు. ఎగ్జిక్యూటివ్‌ అ సోసియేషర్‌ అధ్యక్షుడు మహేంద్ర కుమార్‌, ప్రధాన కార్యదర్శి నితీశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రగతికి బలమైన అడుగులు

జ్యోతినగర్‌/యైటింక్లయిన్‌కాలనీ: ప్రజాపాల న ప్రగతికి బలమైన అడుగులు అని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నా రు. ఎన్టీపీసీలో సోమవారం జరిగిన 99 రోజు ల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సమావేశంలో మేయర్‌ మహంకాళి స్వామి, అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. యైటింక్లయిన్‌కాలనీ అల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పారదర్శకత, వేగం, సమర్థతను పెంపొందించేందుకు ప్రజాపాలన నిర్వహించామన్నారు. రైతుల నుంచి ప్రతీ ధా న్యపు గింజ కొనుగోలు చేస్తామని తెలిపారు. కార్పొరేటర్‌ మారెల్లి సుశిల– రాజిరెడ్డి, నాయకులు రాజేశ్‌, శంకర్‌ నాయక్‌, చక్రపాణి, రా ములు, సాగంటి శంకర్‌, రాజు పాల్గొన్నారు.

రికార్డు అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

పెద్దపల్లి: కమాన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్‌ కె.చిరంజీవిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. విధులకు గైర్హాజరు కావడంతోపాటు, ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడం, మెమోలను స్వీకరించకపోవడంతో తహసీల్దార్‌ నివేదిక ఆధారంగా చిరంజీవిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement