పాలకుర్తి: బసంత్‌నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ లో ఈనెల 7న పర్మినెంట్ కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి యూనియన్ మాజీ అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి, కన్నాల సర్పంచ్ మల్క రామస్వామి, బీజేపీ నుంచి పెద్దపల్లి నియోజకవర్గ నేత నల్ల మనోహర్‌రెడ్డి బరి లో నిలిచారు. బీఆర్‌ఎస్ నుంచి ఎవరూ పోటీ చేయడంలేదు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సొంత నియోజకవర్గమైన రామగుండంలోనే అల్రాటెక్ కంపెనీ ఉంది.
ఇద్దరు మంత్రి అనుచరులు
కాంగ్రెస్ అభ్యర్థి బయ్యపు మనోహర్‌రెడ్డి స్వగ్రా మం మంథని నియోజకవర్గంధిలోని రాణాపూర్. మల్క రామస్వామి అదే నియోజకవర్గంలోని కన్నా ల. వీరిద్దరూ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బా బు ముఖ్య అనుచరులు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు. 2018 ఎన్నికల అనంతరం అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత మనోహర్‌రెడ్డి కన్నాల సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రామస్వామి భార్య చంద్రకళ అప్పటికే కన్నాల సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనోహర్‌రెడ్డి, ఎన్నికల తర్వాత మల్క రామస్వా మి ఇద్దరు కూడా మళ్లీ సొంతగూటికి చేరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రామస్వామి సర్పంచ్‌గా గెలుపొందారు. ఒకప్పటి మిత్రులు సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా పోటీపడడం, అది కూడా ఒకేపార్టీ నుంచి ఇద్దరూ ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికో?
పర్మినెంట్ కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు పోటీలో నిలవడం చర్చనీయాంశశంగా మారింది. అంతేకాదు.. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇద్దరు కూడా స్థానికంగా అందరికీ సుపరిచితులు కావడంతో ఎవరికి మద్దతు ప్రకటించాలనే విషయమై అయోమయం నెలకొంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్.. పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటిస్తారని శ్రేణులు భావించారు. ఈవిషయంలో ఆయన స్పందించకపోవడం, మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోవడంతో ఇద్దరూ పోటీలో నిలవడం అనివార్యమైంది. వీరిలో ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరికి ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది.


