మాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షలతో ఇల్లు పూర్తికావడం లేదు. రేకులషెడ్డు నిర్మాణానికి అనుమతి ఇస్తూ రూ.5 లక్షల బిల్లు మంజూరు ఇవ్వాలి.
– చంద్రయ్య, రమేశ్, కుమ్మరికుంట
బువ్వ పెట్టడం లేదు
నాకు ముగ్గురు కొడుకులు. సంపాదించిన భూమిని వాళ్లకు పంచిఇచ్చా. ఇప్పుడు బువ్వ పెట్టకుండా కొడుతున్నరు. మొన్నటివరకు జమ్మికుంట ఆస్పత్రిలోనేఉన్న. నాకు న్యాయం చేయాలి.
– కొత్తూరు పోచయ్య, జీలకుంట
చర్య తీసుకోవాలి
జేసీబీతో హుస్సేనిమియా వాగులో ఇసుక, మట్టిని తీస్తూ కొందరు రూ.లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారు. వాటిని తీయొద్దని పాలకవర్గం తీర్మానం చేసినా.. అందులో కొందరు స భ్యులు రియల్టర్లలో కుమ్ముకై ్క ఇసుక, మట్టి తీస్తు న్నారు. అక్కడి గుంతలోపడి ఒకరు మరణించారు. వారిపై చర్య తీసుకోవాలి. – వెంగళ కనకయ్య,
9వ వార్డు సభ్యుడు, పెద్దబొంకూర్


