పంట మార్పిడి పద్ధతి మంచిది | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడి పద్ధతి మంచిది

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

● ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్‌రూరల్‌: పంట మార్పిడి ప ద్ధతితో అధిక దిగుబడి సాధ్యమని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. కనుకుల రైతువేది కలో సోమవారం ఏవో పైడితల్లి అధ్యక్షతన రైతువారోత్సవం నిర్వహించారు. విప్‌ మాట్లాడుతూ, వరితోపాటు వాణిజ్య, లాభసాటి, ఆయిల్‌పామ్‌ లాంటి పంటలు వేయాలని రైతులకు సూచించారు. వ్యవ సాయ శాస్త్రవేత్త వెంకన్న, సర్పంచులు కర్రె కవిత, ఉప్పు లక్ష్మి, స్రవంతి, సాయికిరణ్‌ పాల్గొన్నారు.

హనుమాన్‌ భక్తులకు అన్నదానం

ఎలిగేడు: ఎలిగేడు శ్రీకోదండరామాలయంలో హ నుమాన్‌ దీక్షపరులకు చేపట్టిన అన్నదానం కార్యక్రమానికి విప్‌ విజయరమణారావు హాజరయ్యారు. యూత్‌కాంగ్రెస్‌ నాయకుడు దుగ్యాల సంతోష్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement