భానుడి భగభగ | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగ

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

కమాన్‌పూర్‌ 45.7 డిగ్రీలు

కమాన్‌పూర్‌(మంథని): భానుడి భగభగతో ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఇంటి నుంచి బయటికిరాలేకపోతున్నారు. ఆదివారం కమాన్‌పూర్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీల నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం, మల్యాలపల్లిలో 45.6, ఈసాలతక్కలపల్లిలో 45.4, ఓదెలలో 45.3, పాలితంలో 45.2, ముత్తారంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉపాధిహామీ కూలీలు పనులకు వెళ్లాలంటే జంకుతున్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కార్మికులు పనులు చేయలేకపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement