సజావుగా కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

సజావుగా కొనుగోళ్లు

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

పెద్దపల్లిరూరల్‌: ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించాలని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూర మల్లారెడ్డి అన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో శనివారం ధాన్యం, మొక్కజొన్న రైతులు, సెంటర్‌ ఇన్‌చార్జిలతో ఆయన మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. దిగుబడులను నాణ్యతాప్రమాణాలకు లోబడి తీసుకొస్తే సత్వరమే కొనుగోలు చేస్తారని అన్నారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. సీఈవో మదన్‌మోహన్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

విద్యార్థుల స్టడీ టూర్‌

కాల్వశ్రీరాంపూర్‌: మంగపేట గ్రామంలోని దివ్య ఆర్గానిక్‌, వర్మికంపోస్ట్‌ తయారీ కేంద్రా న్ని రామగిరి ఉద్యానవన పాలిటెక్నిక్‌ విద్యార్థులు శనివారం సందర్శించారు. గడ్డి, ఇతర వ్యర్థాలు, వానపాముల ద్వారా వర్మీకంపోస్టు తయారీపై నిర్వాహకులు దివ్యశ్యాం వివరించారు. సేంద్రియ ఎరువుతో భూసారం పెరుగుతందని, ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చని వివరించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రణీ త్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్రాక్‌ పనుల్లో రైల్వేకార్మికులు

రామగుండం: జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. రైల్వేట్రాక్‌పై ఇది 48 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉంటాయి. ఇంతటి ఎండలోనూ రైల్వే కార్మికులు పట్టాల పునరుద్ధరణ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రధానంగా రామగుండం–రాఘవపూర్‌ రైల్వేస్టేషన్ల మధ్య బసంత్‌నగర్‌ రైల్వే వంతెన కింద కార్మికులు ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

పిల్లలకు టీకాలు వేయించాలి

సుల్తానాబాద్‌రూరల్‌: కాట్నపల్లిలో చేపట్టిన వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ రాష్ట్ర పరిశీలకుడు డేవిడ్‌ దామర శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల వయసులోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. క్యాన్సర్‌ రాకుండా14 నుంచి 15 సంత్సరాలలోపు బాలికలకు హెచ్‌వీపీ వ్యాక్సిన్‌ తప్పనిసారిగా వేయించాలని సూచించారు. డీఐవో కిరణ్‌కుమార్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

ప్రభుత్వ డిగ్రీకాలేజీలో చేరండి

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీకాలేజీలో ప్రవేశాలకు దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్‌ దర ఖాస్తులు స్వీకరిస్తున్నారని ప్రిన్సిపాల్‌ లక్ష్మీనర్స య్య తెలిపారు. గతనెల 13న దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. ఫేజ్‌– 1లో నమోదుకు ఈనెల 7వ తేదీ వరకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 8 వరకు వెబ్‌ ఆప్షన్లు నిర్వహిస్తారన్నారు. పెద్దపల్లి కాలేజీలో బీఏ, బీకాం(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బ్యాంకింగ్‌) బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సైస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వివరాలకు ప్రిన్సిపాల్‌ 94403 38459, దోస్త్‌ కో ఆర్టినేటర్‌ 94405 87697, టెక్నికల్‌ అసిస్టెంట్‌ 94411 83584 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

ఇంటింటికీ పౌష్టికాహారం

పెద్దపల్లి: అంగన్‌వాడీ కేంద్రాలకు ఈనెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఇళ్లకు వెళ్లి కుపౌష్టికాహారం పంపిణీ చేసేందుకు అధికారు లు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. గర్భిణులు 4,082 మంది, బాలింతలు 2,391 మంది, ఆరేళ్లలోపు పిల్లలు 2,435 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 17,082 మంది, 3 నుంచి ఆరేళ్ల వయసుగలవారు 18,351 మంది ఉన్నారు. వీరందరికీ బియ్యం, పప్పు, పా లు, గుడ్లు, మురుకులు, బాలామృతం ఇళ్లవద్దనే పంపిణీ చేయనున్నారు. పక్కదారి పట్టకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలి.

Advertisement
 
Advertisement
Advertisement