ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

పెద్దపల్లిరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణ శివారు బంధంపల్లిలో శనివారం జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యక్రమంపై కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మహిళాసాధికారితకు సైతం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వ్యాపారావకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. రైతులు పంటమార్పిడి విధానాన్ని అవలంబిస్తే అధిక దిగుబడి వస్తుందని వెల్లడించారు. ‘మత్తు పదార్థాలకు నేను దూరం.. మరి మీరు’ అని విజయరమణారావు అన్నారు. మత్తునిచ్చే డ్రగ్స్‌, గంజాయిలాంటి పదార్థాల క్రయ, విక్రయాలపై టోల్‌ఫ్రీ నంబరు 1908, హెల్ప్‌లైన్‌ 14446 కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. కొత్త రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. గృహజ్యోతి ద్వారా 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద పేదలు ఇల్లుకట్టుకునే అవకాశం కల్పించామని వివరించారు.

ఇంధన కొరతపై వదంతులు

డీజిల్‌, పెట్రోల్‌ కొరతపై వచ్చే వదంతులను నమ్మి ప్రజలు ఆందోళనపడొద్దని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. జిల్లాలో తగినన్ని నిల్వలు ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు కూర మల్లారెడ్డి, ప్రకాశ్‌రావు, ఆర్డీవో గంగయ్య, కౌన్సిలర్‌ పూరెళ్ల శైలజతోపాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సర్కార్‌ ఆస్పత్రుల సేవల్లో పెద్దపల్లి టాప్‌

పంటమార్పిడి విధానంతో అధికదిగుబడి

ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్‌ సాగుచేయండి

ప్రభుత్వ విప్‌, విజయరమణారావు, కలెక్టర్‌ శ్రీహర్ష

Advertisement
 
Advertisement
Advertisement