భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. జనాలు అల్లాడుతున్నారు. మే ప్రారంభంలోనే ఎండలు మండుతుండడంతో నెలంతా ఎలా గడుస్తుందోనని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. మధ్యా హ్నం ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకు జంకుతున్నారు. అత్యవసరమైతే ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రయాణాలు చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మండుతున్న ఎండల ధాటికి వాహనదారులు, పాదచారులు శనివారం అవస్థలు పడుతూనే గమ్యం స్థానం చేరుకున్నారు.
రోడ్డుపై లారీలు ఇలా.. రాకపోకలెలా?
పెద్దపల్లి – రాఘవాపూర్ మధ్య గోదాముల్లో సరుకులు అన్‌లోడ్ చేసేందుకు వచ్చిన లారీలు ఇరువైపులా నిలిపి ఉంచుతున్నారు. దారి ఇరుకుగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇప్పటికే ప్రమాదాల బారినపడి గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని గిడ్డంగుల నిర్వాహకులు, ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని సర్పంచ్ తాడిచెట్టి చామంతి– శ్రీకాంత్ వాపోయారు. అఽధికారులు చర్యలు తీసుకోవాలని వాహహనదారులు కోరుతున్నారు. – పెద్దపల్లిరూరల్


