పెద్దపల్లిరూరల్: విద్యుత్ ప్రమాదాలను నియంత్రించేందుకు అనుసరించాల్సిన భద్రత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే అధికారులు పా టించాలని ఎస్‌ఈ గంగాధర్ సూచించారు. విద్యుత్ అధికారులతో శనివారం జిల్లా కేంద్రంలో ఆయన సమావేశమయ్యారు. అంతకు ముందు ప్రభుత్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ శ్రీహర్షతో కలిసి విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది పనులు చేసేటప్పుడు భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, టెక్నికల్ డీఈ బాలయ్య, ఆ పరేషన్ అధికారి రాజబ్రహ్మచారి, ఏడీఈ ఆంజనేయరావు, శ్రీనివాస్, జగదీశ్ పాల్గొన్నారు.
వాణిజ్య కార్యకలాపాల్లోకి ఎన్టీపీసీ సోలార్ పవర్ ప్లాంట్
జ్యోతినగర్: ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ.. రామగుండంలోని 176 మెగావాట్ల సోలార్ పీ వీ ప్రాజెక్టులో 100 మెగావాట్ల ప్రాజెక్టును వాణిజ్య కార్యకలాపాల్లోకి ప్రవేశ పెట్టింది. శనివారం జీరో అవర్ నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు న్యూఢిల్లీలోని కార్పొరేట్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చే సింది. కొత్తగా ప్రారంభించిన 100 మెగావాట్ల సో లార్ ప్రాజెక్టు.. విద్యుత్ సామర్థ్యం, దక్షిణ భారతదేశంలో ఎన్టీపీసీ కొనసాగిస్తున్న పునరుత్పాదక ఇంధన విస్తరణలో ఓ భాగమని వెల్లడించింది. ఈప్రాజెక్టును ప్రధాని మోదీ ఈనెల 10న హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభిస్తారని వివరించింది.


