కార్మికులకు శ్రమశక్తి అవార్డులు | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు శ్రమశక్తి అవార్డులు

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

జ్యోతినగర్‌: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మేడే) సందర్భంగా ఎన్‌టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు డి.సత్యం, ఈదునూరి పర్వతాలు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు దేవసాని భిక్షపతి ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ నుంచి వారు అవార్డులు అందుకున్నారు. కష్టపడి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన కార్మికుల సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను కాంట్రాక్టు కార్మికులు తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement