మంథని: కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మేడే సందర్బంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడారు. అర్హులైన మున్సిపల్ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని, మేడే స్ఫూర్తితో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేశ్, నాయకులు వేల్పు ల సురేశ్, గోవింద్, మల్లేశ్, చందు గట్టయ్య, జంప య్య, పోచమ్మ, భాగ్య, సుక్కమ్మ పాల్గొన్నారు.
విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం పెంచుతాం
గ్రామీణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు ఆయన పరిశీలించారు. ‘సూపర్ సమ్మర్’ వేసవి శిబిరాన్ని మంత్రి సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని మంత్రి అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో డిజిటల్ అక్షరాస్యత ఎంతో అవసరమని ఆయన అన్నారు.
అభివృద్ది పనుల్లో వేగం పెంచండి
అనంతరం పట్టణ శివారులోని గోదావరి నదిని సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు.. నదిలో ఎల్లవేళలా స్వచ్ఛమైన నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి.. నిర్మాణంలో కొన్నిమార్పులు సూచించారు. అలాగే నిర్మాణంలోని తహసీల్దార్, ఆర్డీవో, సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను ప రిశీలించి, పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీవో పాత భవనాన్ని ఐటీ శాఖ కు కేటాయించి పునరుద్ధరించాలని చెప్పారు. అ య్యగారి చెరువు సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ ఆరిఫ్ ఉద్దీన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేడే వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు


