మానవ తప్పిదాలేనా? | - | Sakshi
Sakshi News home page

మానవ తప్పిదాలేనా?

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

గోదావరిఖని:

క టీచర్‌ వెన్నెల ఇంట్లో చీకటి.. ఓ అర్చకుడు సంతోష్‌కుమార్‌ ఇంట్లో ఆర్తనాదాలు.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఒకేరోజు జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. క్షేమంగా ప్రయాణించి– క్షేమంగా గమ్యం చేరాలనే లక్ష్యంతో పోలీసు శాఖ విసృత ప్రచారం చేస్తోంది. యముడు, చిత్రగుప్తుడు వేషధారణలతోనూ ప్రజలకు సులభంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సీటుబెల్ట్‌, హెల్మెట్‌, డంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలపై విస్తృత ప్రచారం చేస్తోంది. డీజీపీ నుంచి ఎస్సై వరకు అరైవ్‌ – అలైవ్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు ప్రజాప్రతినిధులను భాగస్వా ములను చేస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. జిల్లాలో గత రెండు నెలల్లో 105 ప్రమాదాలు జరిగి 39 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు.

ప్రచారం ఉన్నా కానరాని ఫలితం

ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులు, రవాణాశాఖ, వైద్యులు, ఇతర విభాగాల అధికారులు కలిసి రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్‌, సీటుబెల్ట్‌ వినియోగం, వేగం నియంత్రణ వంటి అంశాలపై సూచనలు ఇస్తున్నారు. పాఠశాలలు, క ళాశాలలు, ప్రధాన కూడళ్లలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏ ర్పాటు చేస్తున్నారు. రోడ్డు సేఫ్టీ నిబంధనలుపాటించాలని సూచిస్తున్నారు. అయినా ఈప్రచారం ప్రజ ల ప్రవర్తనలో మార్పు తీసుకురాలేకపోతోంది.

ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాలు

ఎవరికీ పట్టని ‘అలైవ్‌– అరైవ్‌’

పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఆగని ఘటనలు

రెండు నెలల్లో 105 ప్రమాదాలు.. 36 మంది దుర్మరణం

ఆందోళన కలిగిస్తున్న వాహనదారుల నిర్లక్ష్యం

రెండు నెలల్లో జరిగిన ప్రమాదాలు

నెల ప్రమాదాలు గాయాలు మృతులు

మార్చి 89 51 30

ఏప్రిల్‌ 19 08 09

మొత్తం 108 59 39

జిల్లాలో జరుగుతున్న ప్రమాదాలకు ఎక్కువసంఖ్యలో మానవతప్పిదాలే కారణమని విశ్లేషిస్తున్నారు. త్వరగా గమ్యం చేరాలనే ఆలోచన తో అతివేగం, తమకేమవుతుందిలే అని మ ద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అంటున్నారు. మొబైల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదాలను తెచ్చపెడుతోంది. అయితే, ప్రమాదం జరిగినా ప్రాణాలను కాపాడుకునేందుకు వీలున్న హెల్మెట్‌, సీటుబెల్ట్‌ వినియోగం సరిగా ఉండటం లేదని పోలీసుశాఖ గుర్తించింది.

ప్రజల్లో మార్పు రావాలి

ప్రమాదాల నియంత్రణకు తరచూ స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అయినా, ఏదోఓచోట ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీసు కమిషనరేట్‌లో అలైవ్‌–అరైవ్‌ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు, స్పీడ్‌ గన్స్‌ ద్వారా వేగంపై డేగకన్ను వేశాం. అయినా, ప్రజల్లో బాధ్యతా రాహిత్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆత్రుత వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది.

– అంబర్‌ కిశోర్‌ ఝా,

పోలీస్‌ కమిషనర్‌, రామగుండం

Advertisement
 
Advertisement
Advertisement