కాల్వశ్రీరాంపూర్: జాఫర్‌ఖాన్‌పేటలో గురువా రం శ్రీరామపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. రామాయణ కళాకారులు శ్రీసీతారామలక్ష్మణుల వేషధారణలతో ప్రదర్శనలు ఇచ్చా రు. మాస్టర్ అశోక్, కళాకారులను గ్రామస్తులు సన్మానించారు. మహిళలు ఒడిబియ్యం పోసి, కట్నకానుకలు సమర్పించారు. ఏగొళపు కుమా ర్ గౌడ్ ట్రస్ట్ చైర్మన్ సదయ్యగౌడ్ అన్నప్రసా దం అందజేశారు. సర్పంచ్ జ్యోత్స్న, ఉప స ర్పంచ్ శ్రావణ్, మాజీ జెడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, మా జీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాశ్, మాజీ ఎంపీటీసీ కొల్లూరి రమాదేవి పాల్గొన్నారు.
ఉద్యోగుల సేవలు ప్రశంసనీయం
జ్యోతినగర్: విధి నిర్వహణలో ఎన్టీపీసీ ఉద్యోగులు ప్రదర్శిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఈడీ చందన్‌కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో ఆయన గురువారం మొ క్కలు నాటించారు. అనంతరం జ్ఞాపికలు అందించి సన్మానించారు. పీటీఎస్ పార్కులో జరి గిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందుతున్న రామలింగేశ్వరరావు, గొల్లపల్లి సత్యనారాయణ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగులు విద్యుత్ ఉత్పత్తిలో చేసిన సేవలు అభినందనీయమన్నారు. అధికారులు, ఉద్యోగుల కుటుంబసభ్యులు, వివిధ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘సరోవర్’ పనుల పరిశీలన
కాల్వశ్రీరాంపూర్: జాఫర్‌ఖాన్‌పేటలోని శ్రీరా మపాద సరోవర్ ప్రాజెక్టు మరమ్మతులను ఇంజినీరింగ్ అధికారులు గురువారం పరిశీలించా రు. తరచూ బుంగపడుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పనులు పక్కాగా చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోత్స్న, ఇరిగేషన్ ఈఈ హరిప్రసాద్, డీఈ రవి, ఏఈ శ్రవణ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఉప సర్పంచ్ శ్రావణి, రైతులు పాల్గొన్నారు.
ఆధునిక పద్ధతులు పాటించాలి
పాలకుర్తి: వ్యవసాయంలో రైతులు ఆధునిక ప ద్ధతులు ఆచరించి తక్కువ పెట్టుబడితో ఎక్కు వ ఆదాయం సాధించాలని కూనారం వ్యవసా య పరిశోధన సంస్థ హెడ్ సతీశ్‌చంద్ర అన్నా రు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమా న్ని గురువారం కుక్కలగూడూరులో నిర్వహించారు. రసాయన వినియోగాలను తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. తద్వారా నేల, నీరు, గాలి కాలుష్యాన్ని నివారించి ప్రకృతిని కాపాడుకోవచ్చునని అ న్నారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, మండల వ్యవసాయాధికారి ప్రమోద్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
జూన్ 5 నుంచి సప్లిమెంటరీ
పెద్దపల్లి: పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ని ర్వహిస్తారని డీఈవో శారద తెలిపారు. ఫెయి లైన విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల ద్వారా Cyber Treasury ద్వారా ఏప్రిల్ 30 నుంచి మే 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.
శస్త్రచికిత్సలు విజయవంతం
పెద్దపల్లి: కాలిన గాయాలతో జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల చేరిన ఓ మహిళ(28)కు డాక్టర్లు సాయిప్రసాద్, విష్ణుచంద్రిక ఆధ్వర్యంలో రెండురోజుల పాటు సాధారణ చి కిత్స అందించారు. చేశారు. పేషెంట్ కోలుకు న్నాక గురువారం ప్లాస్టిక్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఇందులో డాక్టర్ అశోక్‌రెడ్డి బృందం నైపుణ్యం ప్రదర్శించింది. ఆయనతోపాటు డాక్టర్లు సాయిప్రసాద్, స్వాతిని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అభినందించారు. అదేవిధంగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాపడిన ఇద్దరు యువకులకు అరుదైన శస్త్రచికిత్స లు నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్లు వినయ్, భవాని తదితులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు.
టీబీ రహిత జిల్లా లక్ష్యం
పెద్దపల్లి: టీబీ రహిత జిల్లా నిర్మాణానికి అందరం సహకరించాలని గర్రెపల్లి పీహెచ్‌సీ డా క్టర్ ఉదయ్ కుమార్ కోరారు. సుల్తానాబాద్‌లో చెస్ట్ ఎక్స్‌రే ప్రోగ్రాం చేపట్టగా ఆయన మాట్లాడారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.


