రాగం.. తాళం.. పల్లవి | - | Sakshi
Sakshi News home page

రాగం.. తాళం.. పల్లవి

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

మంథని: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఏకై క సంగీత, నృత్య విద్యాలయంలో మూగబోయిన సప్తస్వరాలు త్వరలోనే ఫరిడవిల్లే అవకాశం వచ్చింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష విద్యాలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు యత్నిస్తు న్నా రు. ఇప్పటికే ఇద్దరు అధ్యాపకులను కాంట్రాక్ట్‌ పద్ధ తిన ఇప్పటికే నియమించారు. సొంతంగా భవనం కేటాయించారు. అసంతృప్తిగాఉన్న ఆ భవనాన్ని వి నియోగంలోకి తీసుకొచ్చేందుకు నిధులు కేటాయించడంతో పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలోగా సొంతభవనంలో సంగీత పాఠశాల విద్యార్థులతో కళకళలాడనుంది.

గతమెంతో ఘనం..

ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేదవిద్యకు పుట్టినిల్లు మంథని. ఇక్కడ సంగీత కళాశాల నెలకొల్పితే ప్రాచీన కళలకు జీవం పోసినట్లవుతుంది. ఈక్రమంలోనే మంథనిలో 1992లో సంగీత, నృత్య కళాశాల ప్రారంభించారు. అప్పట్లోనే పూర్తిస్థాయిలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బందిని నియమించారు. దీంతో సప్తస్వరాలు ఫరిడవిల్లాయి. కళల్లో ప్రావీణ్యం సంపాదించిన పలువురు విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో అనేక బహుమతులు అందుకొని కళాశాల ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కానీ.. కొంతకాలానికి కళాశాలను నిర్లక్ష్యం ఆవరించింది. అ ధ్యాపకులు, కార్యాలయ సిబ్బందిని డిప్యుటేషన్‌పై బదిలీచేశారు. కొత్తగా ఎవరినీ నియమించలేదు. సప్తస్వరాల చప్పుడు మెల్లమెల్లగా ఆగిపోయింది. ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు పనులు ప్రస్తుతం ఆగమేఘాలపై కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం 70 మంది విద్యార్థులు

ప్రస్తుతం 70 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. కూచిపూడి నృత్యం, వీణ, వోకల్‌, పే రణి నృత్యం, మృదంగం కో ర్సులు అందుబాటులో ఉన్నా యి. రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ ఉండగా, ఇద్దరు గౌరవ వేతనంపై పనిచేస్తున్నారు. మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తు న్నారు. సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లతోపాటు ఇద్దరు అటెండర్లు ఉన్నారు. గౌరవ వేతనంపై రా జేశం మృదంగం విద్య నెర్పుతున్నారు. ప్రిన్సిపల్‌ కర్నాటక ఓకల్‌ నేర్పుతుండగా పేరణి డాన్స్‌ను మరో అధ్యాపకుడు నేర్పిస్తున్నారు. వయోలిన్‌, కూచిపూడి, సితార, గాత్రం, హిందూస్థానీ, గాయక అకంపనిస్టు, మృదంగం అకంపనిస్టు, వీణపోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అద్దె అవస్థలకు చెక్‌

పాఠశాలకు పక్కాభవనం లేదు. ప్రతినెలా అద్దె రూ.15వేలు భారం పడుతోంది. ఈ అవస్థ మరోనె లలో తీరనుంది. గతంలో మహిళా మండలి స్థలా న్ని పాఠశాలకు కేటాయించారు. నృత్య పాఠశాలకు కేటాయించిన భవనంలో కొన్ని పనులు అసంపూర్తిగా ఉండడంతో కలెక్టర్‌ జోక్యం చేసుకుని రూ.9 లక్షలు కేటాయించారు. దీంతో ప్రహరీ, గేట్లు, మరికొన్ని పనులు చేపట్టారు. అవసరమైన మరో రూ.పది లక్షలు కూడా సమకూర్చినట్లు తెలిసింది.

డిప్లొమా కోర్సుకు కరీంనగర్‌ నుంచి..

కరీంనగర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు డిప్లొమా కోర్సులో చేరినట్లు ప్రిన్సిపాల్‌ శారద జనస్వామి తెలిపారు. వారు నిత్యం పాఠశాలకు వచ్చి విద్య నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. పక్కా భవనం, కింది అంతస్తులోకి పాఠశాల మారుతుందనే సమాచారంతో చాలామంది విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె వివరించారు. ఈ విద్యాసంత్సరం నుంచే సొంత భవనంలోకి మారుతున్నామనేది సంతోషంగా ఉందన్నారు. మంథనిలో మళ్లీ సప్తస్వరాలు పలికించేలా తనవంతు కృషి చేస్తున్నానని అన్నారు. అందరి సహకారంతో పూర్వవైభవం వస్తుందని వివరించారు.

శిక్షణ పొందుతున్న కళాకారులు

అందుబాటులో సప్తస్వరాలు పలికే పరికరాలు

ఫరడవిల్లనున్న సప్తస్వరాలు

సంగీత విద్యకు పూర్వవైభవం

త్వరలోనే సొంత భవనంలోకి పాఠశాల

అద్దె అవస్థలకు చెక్‌.. అడ్మిషన్లు పెరిగే అవకాశం

Advertisement
 
Advertisement
Advertisement